Saturday, May 9, 2026

A New Martial Arts Hero Rising in Tollywood!

EntertainmentA New Martial Arts Hero Rising in Tollywood!

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరహా హీరోల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు Akshar Naidu Kalyani. నిజ జీవితంలోనే బ్లాక్ బెల్ట్ హోల్డర్‌గా, మార్షల్ ఆర్ట్స్‌లో 5 నేషనల్ మెడల్స్ సాధించిన అక్షర్ నాయక్ కళ్యాణి ఇప్పుడు తన మూడో సినిమాతో మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే “2వ గది” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షర్, ప్రస్తుతం రూపొందుతున్న గౌరి శంకర్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం తన బాడీ వెయిట్ తగ్గించుకోవడంతో పాటు ప్రతిరోజూ గంటల తరబడి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, ఒక భావోద్వేగ ప్రేమకథ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందని సమాచారం. “జీరోగా ఉన్న ఒక యువకుడు మార్షల్ ఆర్ట్స్ ద్వారా తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు?” అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

దర్శకుడు Gopinath Thota అక్షర్‌లో ఉన్న డెడికేషన్ చూసి ఎంతో నమ్మకంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

నిర్మాత Pasupuleti Gowri Shankar కూడా నిజమైన మార్షల్ ఆర్ట్స్ స్పిరిట్‌ను తెరపై చూపించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌కు త్వరలోనే ఒక కొత్త యాక్షన్ స్టార్ దొరకబోతున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Check out our other content

Check out other tags:

Most Popular Articles